telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తన తల్లిని కించపరిచిన వాళ్లని నాన్న వదిలినా.. నేను వదలను..

అసెంబ్లీలో తన తల్లిని కించపరిచిన వాళ్లని తన నాన్న వదిలినా తాను వదలనంటూ శపథం చేశారు. బుధ‌వారం మంగళగిరిలో నారా లోకేష్ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం ఇవ్వడానికి వెళ్లిన‌ మా అమ్మపై వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుటుంబానికి ల‌క్ష చెప్పున 48 కుటుంబాల‌కు వెళ్లి 48 ల‌క్ష‌లు రూపాయాలు చెక్కులు ఇచ్చి వ‌చ్చారు. అక్క‌డ ఎవ‌రిని విమ‌ర్శించ‌లేదు..గౌర‌వం కోరుకునే కుటుంబం మాది. మీ ఇంట్లో మీ త‌ల్లి , పెళ్ళాం , కూతురితో ఇట్లానే మాట్లాడుతురా? మహిళల పట్ల గౌరవం లేదు వీళ్ళు మనుషులా? పశువులా? ప్ర‌శ్నించారు.ఈ ఘ‌ట‌న‌పై పెద్దాయ‌న వదిలిపెట్టొచ్చు.. ఆయ‌నది చాలా పెద్ద మ‌నుసు ..నేను వ‌ద‌ల‌ను అంటూ స‌వాల్ విసిరారు.

ఎంతో నిబద్ధతతో నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్నా.. అవమానించడం ఎంటంటూ ప్ర‌శ్నించారు. అంతేకాకుండా ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 

అసెంబ్లీ వేదికగా వైసీపీకి చెందిన కొందరు సభ్యులు నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఈ విషయమై లోకేష్ తొలిసారిగా స్పందించారు..తమ కుటుంబాన్ని ఏదో ఒక విషయంలో బయటి లాగటానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందంటూ విమర్శించారు.

ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న వారంతా రానున్న కాలంలో తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారంటూ హెచ్చరించారు. వరదలు వచ్చిన సమయంలో వైసీపీ కి చెందిన ప్రజా ప్రతినిధులు ఏం చేశారని లోకేష్ ప్రశ్నించారు.ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ప్రజా ప్రతినిధులు పేకాట ఆడారని ఆయన ఆరోపించారు. బియ్యం అమ్ముకొన్నారని ఆయన విమర్శించారు. 

నిన్నటి వరకు తె లుగుదేశం పార్టీ మీద దాడి చేయించిన ఈ ప్రభుత్వం.. నేడు సొంతపార్టీ వాళ్ల మీద దాడులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ విమర్శించారు.

గుంటూరు జిల్లాలోని పెదనందిపాడులోని వెంకటనారాయణపై వైసీపీ కార్యకర్తల దాడులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న ట్విట్టర్ వేదికగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని దూషిస్తోన్న వైసీపీ కార్యకర్తలను ప్రశ్నించ‌డ‌మే నేరమా అంటూ నిలదీశారు. త‌ప్పుని త‌ప్పని చెబితే చంపేస్తారా? అంటూ ప్రశ్నించారు.

Related posts