telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నా అనుభవంలో మంచి, చెడ్డ సీఎంను చూశానని, కానీ దుర్మార్గ సీఎం సీఎం జ‌గ‌నే.

*వైసీపీ స‌ర్కార్‌పై నాగ‌బాబు ఫైర్‌..
*రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది..
*రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత సీఎం జగన్ దే..ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేరు ..
*నా అనుభవంలో మంచి, చెడ్డ సీఎంను చూశానని, కానీ దుర్మార్గ సీఎం సీఎం జ‌గ‌నే..
*రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది..
*రాష్ట్రంలో ప్రతి పౌరుడిది మీద రూ.లక్ష అప్పు ఉంది..

రాజకీయాల్లో దొంగలు పడ్డారని పవన్ కళ్యాణ్ సోదరులు , జనసేన నాయకుడు నాగబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లడారు. దొంగలు రెండు రకాలని.. జనాల్లో వుండే వారు కొందరైతే, రాజకీయాల్లో వుండే వారు రెండో రకానికి చెందిన వారని అన్న‌

రాజకీయ దొంగలను మనమే ఎన్నుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని లేకుండా జగన్‌ మూడేళ్లపాటు పాలించారని ఆయన అన్నారు. జగన్‌ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్‌ చేయలేరన్నారు.

నా అనుభవంలో మంచి, చెడ్డ సీఎంను చూశానని, కానీ దుర్మార్గ సీఎం జగన్‌రెడ్డే అని ఆయన విమర్శించారు.మరోసారి జగన్‌ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా ఇతరరాష్ట్రాలకు పోవాలని ఆయన అన్నారు. జగన్‌ సీఎం అయ్యాకే ఏపీకి అప్పులు, కష్టాలు మొదలయ్యాయన్నారు.

మన రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడాల్సి  వస్తే సిగ్గేస్తుందన్నారు. పక్క రాష్ట్రానికి వెళ్లినప్పడు.. మీది ఏ ఏరియా అని అడుగుతూ వుంటారని అప్పుడు  ఆంధ్రా అని చెప్పగానే ఒక వెటకారపు నవ్వు, ఒక జాలి చూపులు కనిపిస్తాయన్నారు. రాష్ట్రంలో రోడ్లు లేవు, పరిశ్రమలు రాలేదని నాగబాబు మండిపడ్డారు. ఏపీలో ప్రజలకు అన్నీ కష్టాలు, కన్నీళ్లేనని నాగబాబు ఫైరయ్యారు.ఏపీలో ప్రతీ పౌరుడి మీదా లక్ష రూపాయల అప్పు వుందని ఆయన పేర్కొన్నారు.మనందరి కోసం వెన్నెముకలాగా నిలబడ్డ నాయకుడు పవన్ కల్యాణ్అని నాగబాబు చెప్పారు. నిలబడదాం.. తలబడదాం.. గెలుద్దాం, సాధిద్దామన్నారు.

Related posts