telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపు గుంటూర్ లో ఇఫ్తార్‌ విందు..

పవిత్ర రంజాన్‌ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్‌ వేడుక ఈ సంవత్సరం గుంటూరు జిల్లా కేంద్రంలో జరగనుంది. ఈ నెల 3వ తేదీన సోమవారం సాయంత్రం గుంటూరు నగరంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో ముస్లిం మతపెద్దలు, మైనార్టీల సమక్షంలో నిర్వహించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొంది. సీఎంగా జగన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారికంగా జిల్లాలో తొలి సారిగా ఇఫ్తార్‌ విందులో పాల్గొననున్నారు.

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, సీఎంవో నుంచి ఆదేశాలు వెలువడటంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ముస్లిం మతపెద్దలు దువా నిర్వహిస్తారు. అలానే ఉపవాసాలు విరమించి ఇఫ్తార్‌ స్వీకరిస్తారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసే రాత్రి విందు ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు.

Related posts