telugu navyamedia
సినిమా వార్తలు

మోహన్ ఇంద్రగంటి సినిమాలో విలన్ గా నాని…?

nani

ఇటీవల కాలంలో హీరోలు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించడానికి కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. గత కొంతకాలం నుంచి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని సినిమా చేయబోతున్నాడనే వార్తలు విన్పిస్తున్నాయి. అయితే ఇప్పటికి ఈ సినిమా పట్టాలెక్కేలా కన్పిస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో నాని విలన్ గా నటిస్తాడని, మరో యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ పాత్రలో నటిస్తుండగా… నాని అతడికి విలన్ గా కనిపిస్తాడట. అంతేకాదు ఈ సినిమా కథ చెప్పినప్పుడు సుధీర్ బాబు, నాని చాలా ఎగ్జైట్ అయ్యారట. వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటి వరకు నేచురల్ స్టార్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని విలన్ గా ఎంతమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

Related posts