telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య 106వ సినిమా టైటిల్ ఇదే…?

Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ 106 వ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. అందులో ఒక పాత్రలో ఆయన అఘోరాగా కనిపించనున్నారట. గత కొన్నిరోజులుగా ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో ఓ పాట పాడుతున్న అని బాలయ్య తెలిపారు. దాంతో అభిమాలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ లోగా “మోనార్క్” టైటిల్ తో ఫ్యాన్ మేడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Related posts