telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సస్పెన్స్ థ్రిల్లర్ “అంధకారం” టీజర్

Andhakaram

హీరోయిన్ పూజా రామ‌చంద్ర‌న్ ప్రధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం “అంధ‌కారం”. వి విజ్ఞ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్యాష‌న్ స్టూడియోస్, ఓ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లు పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రియ అట్లీ, కే పూర్ణ చంద్ర‌, సుదాన్ సుంద‌ర‌మ్ నిర్మాత‌లుగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో పూజా రామచంద్ర‌న్ తోపాటు కుమార్ న‌ట‌రాజ‌న్, మీనా గోషాల్, అర్జున్ దాస్, వినోత్ కిష‌న్ కీలక పాత్రల్లో న‌టించారు. తాజాగా “అంధ‌కారం” చిత్ర టీజ‌ర్ ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభ‌కాంక్ష‌లు తెలిపారు. ఇక ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ అంధ‌గార‌మ్ టీజ‌ర్ ని ప్ర‌ముఖ తిమ‌ళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ విడుద‌ల చేయ‌డం విశేషం. టీజ‌ర్ మొత్తాన్ని స్ట‌న్నింగ్ విజువ‌ల్స్ తో, థ్రిల్లింగ్ సౌండ్ తో డిజైన్ చేయడంతో ఆడియెన్స్ కి సినిమా మీద మ‌రింత ఉత్కంఠ క‌లుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని సుదాన్ తెలిపారు. కాగా హీరోయిన్ పూజా రామ‌చంద్ర‌న్ స్వామీరారా, పిజ్జా వంటి థ్రిల్ల‌ర్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మే.

Related posts