ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నెం మధుసూదన రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎంఆర్ మాట్లాడుతూ.. దళితులతోపాటు అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి గా గెలిపించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. .ఇప్పటి వరకు ప్రభుత్వేతర సంస్థ ద్వారా దళితులు, బీసీల అభ్యున్నతి కోసం పనిచేశానని, ఇప్పుడు పార్టీలో చేరడంతో ఓ వేదిక లభించినట్టయిందన్నారు. అధినేత అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి పార్టీ గెలుపుకోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఎంఎంఆర్‌గా పారిశ్రామిక వర్గాల్లో పేరున్న మధుసూదన రావు సాధారణ దళిత కుటుంబంలో పుట్టి స్వశక్తితో పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ప్రస్తుతం ఎంఎంఆర్ గ్రూపు సంస్థలకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎంఎంఆర్ డీఐసీసీఐ అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
ఆ హీరో దగ్గర చెమట కంపు తట్టుకోలేకపోయా… రకుల్ సంచలన వ్యాఖ్యలు