telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్, బీజేపీలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయి…

puvvada ajay

తెలంగాణలో ఎంఎల్సి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మంత్రి పువ్వడ అజయ్ కుమార్ మాట్లాడుతూ…. డొల్ల పార్టీలు, పాన్ డబ్బా పార్టీలకు దీటైన సమాధానం ఇచ్చి టీఆర్ఎస్ ను గెలిపిస్తాం అని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 1లక్ష 30 వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ కి దక్కింది. ఎంఎల్సి అభ్యర్థులు పేలే అవాకులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను స్పష్టంగా చెబుతున్నాం… పోటీ చేసే మీ పార్టీ లు ఏమి చేశాయో చెప్పే ధైర్యం ఉందా… దేశం లో నిరుద్యోగనికి  కాంగ్రెస్ పార్టీ కారణం కదా అని అడిగారు. ప్రభుత్వ సహకరం వల్లనే ప్రైవేట్ రంగం లో 5 లక్షల ఉద్యోగాలను ఇచ్చాము. కాంగ్రెస్, బీజేపీలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయి. ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉన్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఏపీకి 8 మెడికల్ కళాశాలలు ఇస్తే మన రాష్ట్రనికి ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వలేదు. అంటే తెలంగాణ పట్ల బీజేపీకి ఎంత వివక్షత ఉందొ తెలుస్తోంది.  తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై బీజేపీ దద్దమ్మ లు ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించిన ఆయన తెలంగాణ కు శ్రీరామ రక్ష కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు. చూడాలి మరి దీనికి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేది.

Related posts