టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వరస హిట్స్ కొడుతున్న బన్నీ వాసు నిర్మాతగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ తీస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో అనసూయ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఈపాటకు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం విడుదల చేయనుంది. దీనికి సంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేయగా.. అందులో కార్తికేయ గిటార్ వాయిస్తుండగా,, అనసూయ ఓ మత్తెకించే పోజు పెట్టి కనిపిస్తుంది. పైన పటారం అంటూ సాగనున్న ఈ పాట.. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో ఉండనుంది అని సమాచారం. అయితే ఈ చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాటలను ఆదిత్య మ్యూజిక్ విడుదల చేయనుంది. మరి చూడాలి ఈ పాట.. ఈ సినిమా అభిరామానులను ఎంత అలరిస్తాయి.. ఎంత ఆకట్టుకుంటాయి అనేది.
ఫలితాల రోజే కూటమి సమావేశం: చంద్రబాబు