telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గౌతం అన్న పేరు నిలబెడతాను..ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగింది.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ సాధించారు. ఆత్మకూరు విజయం సాధించిన తర్వాత తర్వాత ఆదివారం నాడు ఆయన ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..

తన సోదరుడు మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి పై ఉన్న అభిమానంతో ప్రజలు తనకు ఓట్లు వేశారని ఆయన చెప్పారు.గౌతం అన్న పేరు నిలబెడతాను..ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగిందని విక్రం రెడ్డి చెప్పారు. ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగాయ‌ని అన్నారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలే నా గెలుపుకు కార‌ణం అన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్‌ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.

ఓటమి కారణంగానే తమపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విక్ర‌మ్ రెడ్డి అన్నారు మండిపడ్డారు. ఆంధ్ర​ప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదని , రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింద‌న అన్నారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయిందన్నారు. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేద‌ని అన్నారు.

మహానేత వైఎస్‌ఆర్‌ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్ ఒక‌ రాష్ట్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్‌ జగన్‌ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం జ‌ర‌గ‌ద‌ని అన్నారు అని వ్యాఖ్యలు చేశారు.

Related posts