telugu navyamedia
సినిమా వార్తలు

నా ఫుల్ సపోర్ట్ ఆ కంటెస్టెంట్‏కే..

మెగా ఫ్యామిలీ ఎక్క‌డ అడుగుపెడుతుందో అక్క‌డ స‌క్సెస్‌లే. ఎవరికైతే మెగా సపోర్ట్ ఉంటుందో వారికి విజయాలు త‌ప్ప‌వు. బుల్లితెరపై బిగ్ బాస్ షో రోజు రోజుకు పాపులారిటీ పెరుగుపోతుంది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ షోపై స్పందిస్తూ ..ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి తన మద్దత్తుని ప్రకటించాడు.

బిగ్ బాస్ 4లో అభిజీత్ కి సపోర్ట్ చేసి విజేత అవ్వటంతో కీలక పాత్ర పోషించిన నాగబాబు లేటెస్ట్ గా ట్రాన్స్ జెండర్ ప్రియా సింగ్ కి తన మద్దత్తు తెలియజేసాడు. ‘బిగ్ బాస్ షో ఎపిసోడ్ చూశాను. యాంకర్ రవి, షణ్ముఖ్, ప్రియ, నటరాజ్ మాస్టర్,యానీ మాస్టర్ వంటి మంచి కంటెస్టెంట్స్ వచ్చారు. వారితో పాటు ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ వచ్చారు. జబర్దస్త్ షోలో చేసినప్పుడు సాయి అతని పేరు. అప్పటినుండి నాకు పరిచయముంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న 'జబర్దస్త్' లేడీ.. ఎవరో తెలుసా..? | Jabardasth Fame Transgender Priyanka Singh Selected For Biggboss Telugu Season 5 | TV9 Telugu

స్వతహాగా మొగవాడైనా తనలో వచ్చే ఆడ ఫీలింగ్స్ ని గమనిస్తూ.. అందరిలా బాధపడుతూ ఉండకుండా దైర్యంగా ఆపరేషన్ చేసుకుని పూర్తిగా అమ్మాయిలా మారిపోయారు ప్రియాంక సింగ్. నాకు అది బాగా నచ్చింది. ఎంతో మంది తామేంటో ఈ ప్రపంచానికి తెలియనివ్వరు. ఆ తర్వాత తప్పు చేశానా ? అంటూ డిప్రెషన్‏లోకి వెళ్లాడు. నేనే ధైర్యం చెప్పాను. ఎంతో మంది ఆ సంఘర్షణను తమలోనే భరిస్తుంటారు. కానీ నువ్ సాహసం చేశావ్. నీ ఇష్టానికి తగ్గట్టుగా నువ్ బతుకుతున్నావ్ అంటూ సపోర్ట్ ఇచ్చాను.

Bigg Boss Telugu 5: From her Jabardasth stint to rejection from father,  lesser-known facts about the trans woman contestant Priyanka Singh | The  Times of India

అలాంటి ప్రియా నేడు బిగ్ బాస్ 5కి వెళ్ళింది. అదిరింది షో కూడా చేసింది. ఆ తరువాత సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టుకుంది. నా ముందు ఇలా ఎదిగింది. ఎవ్వరినీ నొప్పించదు.. మంచి మనస్తత్వం ఉంది. తను కెమెరా ముందు ఎలా ఉందో.. బయట కూడా అలాగే ఉంటుంది. అందుకే ఈ బిగ్ బాస్ 5లో తనకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది .బిగ్ బాస్ లాంటి పెద్ద ఫ్లాట్ ఫాంలో ప్రియాంక సింగ్ రావడం నాకు ఆనందంగా అనిపించింది. ఇది మంచి అచ్చీవ్ మెంట్. అతను నాకు బిడ్డ లాంటివాడు. నాకు ఎంతో గర్వంగా ఉంది , విన్నర్ కావడమా.. లేదా అన్నది తెలియదు అంటూ నాగబాబు పేర్కొన్నాడు.

కాగా..మీడియా ముఖంగా మెగా ఫ్యామిలీ హీరో ఇలా ఒక కంటెస్టెంట్ కి బహిరంగ మద్దత్తవ్వటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

Related posts