telugu navyamedia
సినిమా వార్తలు

నా సీక్రెట్ అదే…

ఆమె అందం పండుకాసిని వెన్నెల‌, ఆమె మాట తెనే ప‌లుకులు, ఆమె సంప్రదాయపు చీరకట్టులో ఆడ‌త‌నం ఉట్టి ప‌డేలా ఉంటుంది సింగ‌ర్ సునీత‌.. తన మధురమైన గానంతో, చ‌క్క‌నైన మాట‌తో తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తుంది. చక్కని రూపంతో ఆకట్టుకుంటున్న సునీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

Telugu singer Sunitha gets engaged to her partner Ram Veerapaneni | The News Minuteఇటీవల మ్యాంగో అధినేత రామ్‏ను రెండో వివాహం చేసుకున్నసునీత కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో గాయని సునీతను ట్రోల్ చేసినంతగా వేరే ఏ సెలబ్రిటీని ట్రోల్ చేయలేదు అంటే అతిశయోక్తికాదు. అంతేకాదు వివాహం అనంతరం సునీత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల తన జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల గురించి ప్రస్తావించిన ఆమె.. తాజాగా.. తన ఎనర్జీకి గల సిక్రెట్ గురించి చెప్పేశారు.

 

Sunitha Upadrashta and Lydian Nadhaswaram to perform in Hyderabad on August 4 - The Hindu

ఇటీవల కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో సోష‌ల్ మీడియాలో లైవ్ చాట్స్ నిర్వహిస్తూ.. నెటిజన్లు అడిగిన పాటలను ఆలపిస్తూ వచ్చారు. కరోనా వైరస్ వల్ల ప్రజల్లో ఉన్న భయాలు, ఆందోళనలను తన పాటలతో దూరం చేస్తూ తన అభిమానులకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను, వృతిపరమైన విషయాలను నెట్టింట్లో షేర్ చేసుకుంటూ..లైవ్ చాట్స్ ద్వారా అభిమానులకు టచ్‏లో ఉంటూ వస్తున్నారు సునీత. తాజాగా ఇన్‏స్టా వేదికగా.. తన ఎనర్జీకి కారణం పాడటం మాత్రమే అంటూ సిక్రెట్ రివీల్ చేశారు.

Related posts