telugu navyamedia
సినిమా వార్తలు

ఏపీ ప్రభుత్వంపై వ‌ర్మ లేటెస్ట్‌ ట్వీట్స్‌..వైర‌ల్‌

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్స్ ధరల తగ్గింపు పై ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. సినిమా టికెట్స్ ధరల నిర్ణయం పై సంచలన దర్శకుడు, వివాదాల వర్మ రంగంలోకి దిగిన అనంతరం.. మరింత మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారింది.

ట్విట్టర్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వార్ తరువాత ఆయనను కలవడానికి అనుమతి అడిగాడు. ఆయన కూడా సరేనని చెప్పడంతో నిన్న ఏపీ సచివాలయంలో మంత్రిని కలిసి సోమవారం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చర్చలు చాలా సంతృప్తికరంగా, సానుకూలంగా జరిగాయని చెప్పిన వర్మ.. మళ్లీ మంగళవారం తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ల ప్ర‌శ్న‌లు స్టార్ట్ చేశాడు.

టిక్కెట్ల సమస్య స‌ద్దుమ‌ణిగింద‌నుకుంటే..కట్టప్పను ఎవరు చంపారు ? అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఆర్జీవీ చేసిన లేటెస్ట్ ట్వీట్ వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా అయిన సరే మహారాష్ట్రలో ఆర్ఆర్ఆర్ టికెట్ ధర ను పెంచుకోవడానికి అనుమతినిచ్చింది.“రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ ధర రూ. 2200/-కి మహారాష్ట్రలో అనుమతి ఉంది. ఎక్కడ సినిమా టికెట్ ధర రూ. 2200/-లకు అమ్ముతున్నారు ? అని ప్రశ్నించే వారికి… ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోంది. కానీ సొంత రాష్ట్రం ఏపీలో టికెట్లను రూ. 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది… “కట్టప్పను ఎవరు చంపారు? ” తాజాగా ట్వీట్ చేశారు.

పవన్‌ కళ్యాణ్‌ లాంటి కొంత మంది తారలకు ఎక్కువ పారితోషికం ఎందుకివ్వాలనే విసయంలో మనం ఫోన్‌ని పగలగొట్టి, ఉపయోగించిన మెటీరియల్‌ వాస్తవ ధరను లెక్కించినట్టయితే అది వెయ్యి రూపాయలు కూడా కాకపోవచ్చు. కానీ ఆలోచన బ్రాండ్‌,మార్కెట్‌ డిమాండ్‌ కారణంగా దాదాపు రెండు లక్షలకు ఆ ఫోన్ విక్రయించబడుతుందని తెలిపారు వర్మ.

ఒక వస్తువును తక్కువ ధరకు అమ్మాలని ప్రభుత్వం బలవంతం చేేస్త, అసలు ఉత్పత్తే ఆగిపోవచ్చు. అప్పుడు క్వాలిటీ లేని ప్రొడక్ట్‌లు బయటకు వస్తాయి.

సినిమా టికెట్లకు విధించినట్లే ఇంకేదైనా ప్రొడక్ట్‌పై ప్రభుత్వం నిబంధనలు విధించిందా? ఒకవేళ విధించినట్లు అయితే ఆ ఉత్పత్తి పేరు, అందుకు కారణాలు తెలపాలి.

చైనా జనాభా మనకంటే ఎక్కువ. అమెరికా జనాభా మనకన్నా తక్కువ. కానీ ఆ రెండు ప్రాంతాల్లోనూ మన కన్నా పదిరెట్లు ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. ప్రదర్శన విషయంలో మనం ఆ సంఖ్యను చేరుకునేలా ప్రభుతాలు కృషి చేయాలి.

సినిమాటోగ్రఫీ చట్టం 1955ని దాదాపు 70ఏళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం  హఠాత్తుగా తవ్వి, దాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యంకాదు. ఈ చట్టాన్ని కోర్ట్ లో సవాల్‌ చేయాల్సిన అవసరం ఉందంటూ ప్ర‌శ్న‌లు వ‌ర్షం కురిపించాడు.

చివరిగా నేను కోరేది ఒకటే… ప్రభుత్వం, మంత్రి పేర్ని నాని, ఆయన టీమ్‌తో నా సహచరులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోకుండా ఆరోగ్యకరమైన చర్చ జరిపితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 

Related posts