telugu navyamedia
రాజకీయ వార్తలు

నన్నే అడ్డుకుంటారా.. పోలీస్ అధికారి పై మంత్రి ఫైర్

bihar minister police

బీహార్‌ రాష్ట్రంలో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రిని పోలీసు అధికారి అడ్డుకొన్నారు. తనను గుర్తించకపోవడమే కాకుండా అడ్డుకున్న పోలీసు అధికారిపై ఆయన చిందులేశారు. మంత్రినే గుర్తించలేని ఇలాంటి వారిని ఎలా నియమిస్తారంటూ నిప్పులు చెరిగారు.

సివాన్ నగరంలోని ఓ ఆసుపత్రి శంకుస్థాపనకు ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, అమాత్యుడిని గుర్తించని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మంత్రిని అడ్డుకున్నారు. అంతే, ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. మంత్రిని గుర్తించలేని ఇలాంటి వారిని ఎందుకు నియమిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, విధుల నుంచి అతడిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.

Related posts