మంచు మనోజ్ జనసేన ను అభినందించాడు. దేశం కోసం పవన్ చొరవ గమనార్హం అని మనోజ్ ట్వీట్ చేశాడు. వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు, విద్యావంతులు జనసేన పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాసేవ కోసం పలువురు విద్యావంతులు ముందుకు రావడాన్ని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్వాగతించారు. దీనివల్ల ప్రజలకు గణనీయమైన లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల తాను సూపర్ హ్యాపీగా ఉన్నానని తెలిపారు. విద్యావంతులు, నిపుణులపై నమ్మకంతో వీరికి పవన్ కల్యాణ్ బాధ్యతలు అప్పగించారని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన మనోజ్ పొన్ రాజ్, పుల్లారావు వంటి నిపుణులు జనసేనలో చేరిన సందర్భంగా తీసిన ఫొటోను ట్వీట్ కు జత చేశారు.
Having well educated professionals to help serve the public just adds a great value and meaning..👍👍 Super happy to see @PawanKalyan sir take the initiative in trusting and giving respect to the worthy in @JanaSenaParty #APEletctions2019 #EducatedPeople pic.twitter.com/j2R9E15Opc
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) February 8, 2019