telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గాయాన్ని దాచకే ప్రేమా…

ఏ అడుగు తడబడుతుందో
ఏ మనసు పొరబడుతుందో
గాయాన్ని దాచకే ప్రేమా
గతముందని..
ఏ నవ్వు నిలబడుతుందో
ఏ చూపు బలపడుతుందో
గానాన్ని ఆపకే ప్రేమా
శ్రుతిలేదని..
పరదాలు పక్కకి జరిపి
పరికించు లోకాన్ని
సరదాలు మదికై నెరపి
పంపించు శోకాన్ని…
జత నిలుచు జన్మల తోడు
వెతుకుతూ నిను చేరే వేళ
లోకంతో నువు పోరాడు
కాలమే తంతు జరిపించాల…

Related posts