telugu navyamedia
సినిమా వార్తలు

తొలిసారిగా తండ్రితో కలిసి నటిస్తున్న మంచు లక్ష్మీ..

డైలాగ్ కింగ్ మెహ‌న్‌బాబు కుమార్తె ల‌క్ష్మీ మంచుకలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం…. ఫిబ్రవరిల 12న ( శనివారం) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

My joy knows no bounds': Lakshmi Manchu on her first movie with dad Mohan Babu | Telugu Movie News - Times of India

తొలి షాట్ కు దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహించగా… ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మంచు విష్ణు తనయుడు అవ్రామ్, లక్ష్మీ కుమార్తె విద్యా నిర్వాణ స్క్రిప్ట్‌ అందజేశారు.

My joy knows no bounds': Lakshmi Manchu on her first movie with dad Mohan Babu

ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకుడుగా వ్య‌వ‌హారించ‌నున్నారు. ‘‘ఇదొక స్టన్నింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌’’ అన్నారు దర్శకుడు.

తండ్రితో సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీ మంచు సోష‌ల్ మీడియాలలో పేర్కొన్నారు. తాను కలలు కన్న రోజు ఇదని చెప్పారు. నా ఫస్ట్ హీరో, మా నాన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నటిగా ఓ అవార్డు అందుకున్నట్టు ఉందని పోస్ట్‌ చేశారు.

మలయాళ నటుడు సిద్ధిఖ్‌ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రం మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఒక షెడ్యూల్ లో పూర్తి చేస్తామన్నారు .

Related posts