‘రాఖీ’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కి చెల్లెలుగా నటించిన మంజూషాకి నటిగా సక్సెస్ రాలేదు. సినిమాలకు దూరంగా ఉంటూ యాంకరింగ్ వైపు మొగ్గుచూపింది. పెద్ద హీరోల సినిమాల లాంచింగ్‌లకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఈమెనే ఎంచుకుంటారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో వర్కౌట్స్ చేస్తూ స్లిమ్‌గా తయారవుతున్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎన్నో ఏండ్లుగా నడుస్తున్న జబర్దస్త్ కామెడీ షోకి రష్మీ, అనసూయలే యాంకరింగ్ చేస్తున్నారు. మధ్యలో ఎంతమంది రావాలని ప్రయత్నించినా విఫలమయ్యేది. అయితే లాక్‌డౌన్ తర్వాత జబర్దస్త్‌కి యాంకర్‌గా మంజూష రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే హైపర్ ఆది స్కిట్‌లో ఒకసారి కనిపించింది. ఈమె ఆసక్తిని బట్టి చూస్తుంటే జబర్దస్త్‌పై కన్నేసినట్టే తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజం అయితే రష్మీ, అనసూయ ఇద్దరిలో ఎవరు వెళ్లిపోతున్నారో చూడాలి.
previous post
next post
రాజకీయ నాయుకులు ప్రజల సమస్యలపై పోరాడండి- తారక్