telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల పై మహరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…

uddhav-thackeray-shivasena

ప్రస్తుతం యూకే నుంచి వచ్చిన కొత్త కరోనా మన దేశంలో వ్యాపిస్తుంది. దాంతో చాలా రాష్ట్రలో అక్కడి నుండి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే యూకే నుండి వచ్చే ప్రయాణికులలో ఎటువంటి కరోనా లక్షణాలు లేని వారికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు జరపమని మహరాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. యూరప్, దక్షిణ ఆఫ్రికా ఇతర దేశాల నుంచి వారికి ఎటువంటి పరీక్షలు ఉండవని తేల్చి చెప్పింది. మహరాష్ట్రకు వచ్చిన వారిలో లక్షణాలు లేని వారని పెయిడ్ క్వారంటైన్‌కు తరలిస్తామని, అక్కడ ఉంచిన ఐదు, ఏడు రోజులలో వారి ఖర్చుతో ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇటీవల యూరప్ నుంచి రానున్న ప్రయానీకుల విషయంలో అన్ని అనుమతులతో  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్‌ను తీసుకురావాలని తెలిపారు. అయితే దీనికి కారణం ఇటీవల యూకే వచ్చిన కరోనా కొత్త రకం. దీనిని సాధారణ కరోనా కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని నుంచి తమ ప్రజలను కాపాడుకుంనేందుకు ప్రతీ దేశం తోచిన చర్యలను చేపడుతోంది. ఇదే విధంగా మన దేశం కూడా యూకే నుంచి రానున్న విమానాలను నిలిపివేసింది. ప్రస్తుతం దీనిని ఎదుర్కొనేందుకు అనేక పద్దతులను ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయి. చూడాలి మరి అది ఎప్పటివరకు వస్తుంది అనేది.

Related posts