telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రధానికి మహారాష్ట్ర సీఎం లేఖ…

uddhav-thackeray-shivasena

క‌రోనా మ‌హ‌మ్మారిని కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ విప‌త్తుగా ప‌రిగ‌ణించాల‌ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. క‌రోనాను జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టిస్తే రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ నిధుల‌ను (ఎస్డీఆర్పీ) నిధుల‌ను క‌రోనా సాయం కింద బాధితుల‌కు వెచ్చించే వెసులుబాటు క‌లుగుతుంద‌ని లేఖ‌లో పేర్కొన్న ఆయ‌న‌.. ఇది త‌మ‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని.. అదే విధంగా.. చిరు వ్యాపారుల‌కు ఊర‌ట ఇచ్చేలా మార్చి, ఏప్రిల్ మాసాలకు సంబంధించి జీఎస్టీ రిట‌న్స్ దాఖ‌లు గ‌డువును పొడిగించాల‌ని కూడా విజ్ఞ‌ప్తి చేశారు.. ఇక‌, క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త నేప‌థ్యంలో రాష్ట్రంలో మినీ లాక్డౌన్ అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు.. కాగా, కోవిడ్ సెకండ్ వేవ్ మ‌హారాష్ట్రలో క‌ల‌వ‌రం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే.

Related posts