telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఉమామహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబే కారణం..ఎన్టీఆర్‌ కుటుంబంలో ఆయ‌న ఒక శని

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి మరణం తనను కలచివేసిందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఉమామహేశ్వరి మృతి వెనక ఏదో ఉందని లక్ష్మీపార్వతి అనుమానం వ్యక్తం చేశారు.

ఉమా మహేశ్వరి మృతి మిస్టరీగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యకు ముందు లెటర్ రాసిందని చంద్రబాబు అక్కడకు వెళ్లిన తర్వాత ఆ లెటర్ మాయమయిందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ కుటుంబానికి శనిలాంటోడని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె సూసైడ్‌ నోట్‌ మాయం కావడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలని చెప్పారు. ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్‌ కుటుంబంలోనే లేదన్నారు. ఆస్తి కోసం, చంద్రబాబు, లోకేష్‌ ఆమెతో గొడవ పడుతున్నారని.. ఆ ఒత్తిడి భరించలేకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుంద‌ని అనుమానం వ్య‌క్తం చేసింది.

ఎన్టీఆర్‌ కుటుంబంలోకి శనిలా చంద్రబాబు ప్రవేశించారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. బాబు ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్‌ మరణానికి కారణమై ఆ పేరును వాడుకుం టున్న దుర్మార్గుడు చంద్ర‌బాబు అని ధ్వజమె త్తారు. పార్టీ పేరుతో రూ.లక్షల కోట్లు సంపాదించారని విమర్శించారు.

చంద్ర బాబు వెంటనే ఎన్టీఆర్‌ కుటుంబాన్ని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. బాల కృష్ణకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఎన్టీఆర్‌ చిన్న కూతురు ఆత్మహత్య అంతా ఓ మిస్టరీలా ఉన్నా.. సోషల్‌ మీడియాలో చాలా వస్తున్నాయన్నారు. బాబు మనస్తత్వం, అతడి నీచ, హత్యా రాజకీయాలు తెలిసిన ఎవరైనా కొన్నిం టిని అనుమానించక తప్పదని చెప్పారు.

శవ రాజకీయాలు చంద్రబాబుకు వెన్న తో పెట్టిన విద్య అన్నారు. హరికృష్ణ మరణానికీ పరోక్షంగా బాబే కారణమని జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ ఇప్ప టికీ ఆయనతో మాట్లాడరని తెలిపారు.అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. 

ఉమా మహేశ్వరి ఆత్మహత్య విషయంలో నీకు ఏ సంబంధం లేకపోతే.. ఆమె ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని.. ఆయన రాయకపోతే తానే లేఖ రాస్తానన్నారు. 

మరో వైపు ఉమా మహేశ్వరి ఆత్మహత్య విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమా మహేశ్వరి ఆత్మహత్య విసయంలో  వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Related posts