telugu navyamedia
తెలంగాణ వార్తలు

హ‌న్మ‌కొండ‌ చేరుకున్న సీఎం కేసీఆర్..రేపు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే

*హ‌న్మ‌కొండ‌కు బయలు దేరిన సీఎం కేసీఆర్
*రేపు ఉద‌యం వ‌ర‌ద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌
*ఈ రాత్రికి హ‌న్మ‌కొండ‌లో సీఎం కేసీఆర్ బ‌స‌

గోదావరి పరీవాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వ‌రంగ‌ల్‌కు రోడ్డుమార్గంలో బ‌య‌ల్దేరి వ‌రంగ‌ల్ చేరుకున్నారు.. ఇవాళ రాత్రికి హ‌నుమ‌కొండ‌లో బ‌స చేస్తారు.

ఆదివారం ఉద‌యం వ‌రంగ‌ల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి హెలికాప్ట‌ర్ ద్వారా గోదావ‌రి న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో వ‌ర‌ద ప‌రిస్థితిని కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే కొనసాగనున్నది.

ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, పల్లా రాజేశ్వరరెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్, ఆర్అండ్ బి, వైద్య ఆరోగ్యవాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

కాసేప‌ట్లో సీఎం కేసీఆర్ వరద పరిస్థితులపై ఆ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో భేటీ అయి ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

Related posts