telugu navyamedia
తెలంగాణ వార్తలు

 స్పీకర్‌ సభకు అధిపతి..హుందాగా వ్య‌వ‌హ‌రించాలి..

తాను ఏనాడూ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడలేదని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. టీఆర్ ఎస్‌ నేతలే స్పీక‌ర్‌ గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు..20 ఏళ్లలో స్పీకర్​ను అవమానించిన ఘటనలు లేవని వెల్లడించారు.మరమనిషి అన్నందుకు తనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనకు ఇప్పటివరకు ఎటువంటి నోటీసు అందలేదని చెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.

 స్పీకర్‌ సభకు అధిపతి అని అందరి హక్కులు కాపాడాలన్నారు. స్పీకర్ తనకు తండ్రిలాంటివారని పేర్కొన్నారు. హుందాగా బతికిన వ్యక్తి స్పీకర్‌ అని అటువంటి వ్యక్తిని అగౌరపరిచింది తాను కాదన్నారు. 

అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులే నిర్వహించడమేంటన్న ఈటల… ప్రజాసమస్యలపై పోరాడేందుకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 

చావుకు సిద్దపడుతానే తప్ప రాజీ పడేదేలేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దమ్ముంటే తన మొహాన్ని సీఎంను చూడమనండనీ.. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాన‌ని, త‌న‌ను ఎక్కడి నుంచి పోటీ చేయమంటారో చెప్పండని సవాల్ విసిరారు.

బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడంపై ఈటల రాజేందర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు. గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచారని చెప్పారు. అసెంబ్లీలో సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో మంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అనుమతి లేకుండా సీఎం కేసీఆర్‌ను కలవలేరని అన్నారు.

 

Related posts