telugu navyamedia
క్రీడలు

క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ నెల 25వ తేదీ నుండి స్పెషల్ సమ్మర్ కోచింగ్ ప్రారంభం

ఈ నెల 25న విక్టరీ ప్లే గ్రౌండ్ లో స్పెషల్ సమ్మర్ కోచింగ్ ను లాంఛనంగా ప్రారంభించనున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

353 క్రీడా ప్రాంగణాల్లో 915 సమ్మర్ కోచింగ్ సెంటర్లకు ఏర్పాట్లు పూర్తి

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను ఈ నెల 25న మంగళవారం ఉదయం 8 గంటలకు  ఖైరతాబాద్ జోన్ చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు.
అదేవిధంగా మిగతా ఐదు జోన్లలో ఏప్రిల్ 26న సాయంత్రం 4 గంటలకు చార్మినార్ జోన్ లో కులి కుతుబ్ షా స్టేడియం, ఏప్రిల్ 27న ఉదయం 8 గంటలకు  సికింద్రాబాద్ జోన్ లో మారేడుపల్లి ప్లే గ్రౌండ్, ఏప్రిల్ 28న సాయంత్రం 4 గంటలకు కూకట్ పల్లి, శేరిలింగం పల్లి జోన్ పి.జె.ఆర్ చందానగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం, ఏప్రిల్ 29న ఉదయం 8 గంటలకు ఎల్బీనగర్ జోన్ ఉప్పల్ స్టేడియంలో  సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను ప్రారంభిస్తారు.
జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు 353 ప్లే గ్రౌండ్ లలో 915 కోచింగ్ సెంటర్లను  సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను 37 రోజుల పాటు నిర్వహించబడతాయి.  ఈ సమ్మర్ క్యాంపులలో 44 రకాల క్రీడలలో శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు పిల్లలకు జిహెచ్ఎంసి పరిధిలో వివిధ ప్లే గ్రౌండ్ లలో నిర్వహించడం జరుగుతుంది.

Related posts