దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ఢిల్లీలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. విజయవాడ కనక దుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తో సహా, మొత్తం 16 ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని…విజయవాడ కనక దుర్గ ఫ్లైఓవర్ కోసం టిడిపి అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ దేశంలో అద్భుతమైన కట్టడమని..టిడిపి ప్రభుత్వ హయాంలో నితిన్ గడ్కరీ సహకారంతో ప్రాజెక్టును కీలక దశకు తీసుకువచ్చామన్నారు. విజయవాడ అందాన్ని మరింత పెంచేలా కనక దుర్గ ఫ్లై ఓవర్ ఉందని… కనక దుర్గ ఫ్లైఓవర్ తో విజయవాడ లో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు.
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా విజయవాడ వాసుల కల అని.. ఈరోజు ఒక భాగం పూర్తయి, మరో భాగం ప్రారంభోత్సవం చేసుకున్నామని తెలిపారు. టిడిపి హయాంలో గత కేంద్ర మంత్రుల సహకారంతో అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని…2014 నుంచి 2019 వరకు ఏపీకి ఒక స్వర్ణ యుగం అన్నారు. విభజన తరువాత రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయని…కియా మోటార్స్, హీరో మోటార్ సైకిల్ ఫ్యాక్టరీలు, విశాఖ ఫైనాన్షియల్ హబ్ తో సహా, అనేక ఇతర ప్రాజెక్టులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని తెలిపారు.
మరోసారి జడేజా పై మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు…