telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తెరచుకున్న కేధార్‌నాథ్‌ ఆలయం

kedarnath temple

ఆరు నెలల అనంతరం పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయం గురువారం తెరుచుకుంది. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు రేపటి నుంచి బద్రీనాథ్‌ ఆలయ దర్శనం ప్రారంభం కానుంది.

కాగా చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. శీతాకాలంలో విపరీతమైన మంచు కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. వేసవి ఆరంభమైన కొద్దిరోజులకు తలుపులను తెరుస్తారు. భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తారు. ఇక అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు.

Related posts