కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కేసీఆర్ లాక్‌డౌన్‌ను మరో 2 వారాలు పొడిగించాలని ప్రధానిని కోరారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ బాగా ఉపయోగపడిందన్నారు.
కరోనా వ్యాప్తిని నిరోధించడంలో లాక్‌డౌన్ బాగా ఉపయోగపడిందని తెలిపారు. రైతులు నష్టపోకుండా, నిత్యావసరాలకు ఇబ్బంది కలకుండా.. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలన్నారు. కరోనాపై జరిగే యుద్ధంగా భారత్ తప్పక గెలుస్తుందని మోదీతో కేసీఆర్ ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, రాష్ట్రానికి కేంద్రం ఆర్థికసాయం చేయాలని కోరారు.
అప్పులు, రాష్ట్రం చెల్లించాల్సిన నెలసరి చెల్లింపుల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలన్నారు. వచ్చే ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నడిచేలా చూడాలన్నారు. వ్యవసాయాన్ని నరేగాతో అనుసంధానం చేయాలని, కరోనాను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలి: కోదండరాం