telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వారం రోజుల లాక్‌డౌన్‌కే జీతాలు ఇచ్చుకోలేని దుస్థితి: ఉత్తమ్ ఫైర్

uttam congress mp

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న ప్రతిపక్షాల నేతలతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కేసీఆర్ వ్యవహార శైలి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందన్నారు.

బాండ్ల ద్వారా సేకరించిన ఆ రూ.1500 కోట్లు ఏమయ్యాయని తెలంగాణ ప్రశ్నించారు. వారం రోజుల లాక్‌డౌన్‌కే జీతాలు ఇచ్చుకోలేని స్థితికి ప్రభుత్వం చేరుకుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నగదు సాయం ఇప్పటికీ అందలేదన్నారు. వలస కూలీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఉత్తమ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సాయం కింద అందిస్తున్న బియ్యం ఏమయ్యాయని నిలదీశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపాదించిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

Related posts