telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాహుల్, ప్రియాంక పోరాటం చూసి కాంగ్రెస్ లో చేరా..

harshavardhan arrest in

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హత్రాస్ ఘటన పై రాహుల్, ప్రియాంక పోరాటం చూసి నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరానని… ఆంధ్ర ప్రదేశ్ లో దళితులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాడులకు పాల్పడే వారికి కొమ్ముకాస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని.. రాజమండ్రి శిరోముండనం ఘటనలో ఎస్సైని అరెస్టు చేసి రెండు రోజుల్లోనే బెయిలుపై విడుదల చేశారన్నారు. రాష్ట్రపతి స్వయంగా జోక్యం చేసుకుని ఈ ఘటనపై వివరాలు అడిగారని… సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలికి చట్టప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వడం లేదని తెలిపారు.  రాష్ట్రంలో మైనారిటీలకు సైతం రక్షణ లేదని.. కేంద్ర హోంమంత్రి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకుని విచారణ జరపాలని కోరుతున్నానన్నారు.

సీఎం పోలవరం పర్యటన సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు పరిహారం ఇవ్వాలని కోరారని.. రైతులు తమ గోడు చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఒక్కరిని కూడా దగ్గరకు రానీయలేదని వెల్లడించారు. జులై కి నిర్మాణం పూర్తి చేస్తే ముంపు తప్పదు. ముందు పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేయాలని.. ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతులకు మద్ధతు ప్రకటిస్తున్నానని తెలిపారు. రైతులను భాగస్వాములను చేయకుండా ఈ చట్టాలు ఎందుకు తయారుచేశారు..!? రైతుల లాభనష్టాల గురించి అధికారులకు ఏం తెలుస్తుంది? అని ప్రశ్నించారు. బీజేపీ వచ్చాక మతపరమైన ఉద్రిక్తతలు పెంచి లాభపడుతోందని.. ముందు చట్టాలు రద్దు చేసి, రైతులతో చర్చించి కొత్త చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.

Related posts