telugu navyamedia
సినిమా వార్తలు

తల్లి కాబోతున్న కత్రినా.. వీడియో వైరల్

బాలీవుడ్​ సీనియర్​ నటి కత్రినా కైఫ్.. తన సహ నటుడు విక్కీ కౌశల్‌ను నాలుగు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

విరామం దొరుకుతే చాలు.. భర్త విక్కీ కౌశల్​తో కత్రినా తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్​ అంటూ ఓ వార్త ఒక‌టి వైర‌ల్ అవుతుంది.

తాజాగా కత్రినా కైఫ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది​.. ఆమె ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

 

పింక్ కలర్ చుడిదార్ లో బొట్టు పెట్టుకొని సింపుల్ గా ఉన్న కత్రినా ఎంతో అందంగా కనిపించింది. ఈ వీడియో చుసిన పలువురు నెటిజన్లు.. కత్రినా ప్రెగ్నెంట్ అని పుకార్లు పుట్టించారు. ఆమె నడుస్తున్న తీరు, కొద్దిగా లూజ్ డ్రెస్ లో బొద్దుగా కనిపించడంతో కత్రినా త్వరలో తల్లికాబోతుందని ప్రచారం మొదలుపెట్టేశారు.

పెళ్లైన నాలుగు నెలలకే కత్రినా ప్రెగ్నెంట్​ అయ్యారంటూ సెటెర్లు విసురుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related posts