స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా “అల వైకుంఠపురంలో” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ను ఢీ కొట్టే విలన్‌గా కోలీవుడ్ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే తెలుగులో చిరంజీవితో `సైరా నరసింహారెడ్డిలో నటించిన విజయ్ సేతుపతి, మరో్ మెగా క్యాంప్ హీరో వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` చిత్రంలోనూ నటిస్తున్నాడు. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోనూ నటించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
previous post