telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వెంకీ మామ” స్పెషల్ వీడియో… రాశి ఖన్నా బర్త్ డే కనుక

Venky-Mama

కె.ఎస్‌.ర‌వీంద్ర దర్శకత్వంలో ప్ర‌స్తుతం నాగ చైతన్య త‌న మామ వెంక‌టేష్‌తో క‌లిసి “వెంకీమామ” చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్‌, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల నాగ చైతన్య పుట్టినరోజున ఈ చిత్రబృందం నాగ చైతన్యకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా రాశీఖ‌న్నా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వెంకీ మామ నుండి స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియో అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.

ఊహాలు గుస‌గుస‌లాడే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖ‌న్నా ప్ర‌స్తుతం వెంకీమామ‌, ప్ర‌తిరోజు పండ‌గే, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ లవర్, సైతాన్ కా బ‌చ్చా అనే సినిమాలు చేస్తుంది. నిన్న ప్ర‌తిరోజు పండ‌గే సెట్‌లో రాశీతో కేక్ క‌ట్ చేయించింది చిత్ర బృందం.

Related posts