telugu navyamedia
సినిమా వార్తలు

స్టేజ్ పై షర్ట్ విప్పిన హీరో… షాకైన ప్రేక్షకులు

Karthikeya

పబ్లిసిటీ పేరుతో మన కుర్ర హీరోలు చేస్తోన్న కొన్ని స్టంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిన్న జరిగిన”‘హిప్పీ” సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఆనందంలో తన చొక్కా విప్పేసి విసరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి టాలీవుడ్ లో ఇలా ఎవరూ ప్రవర్తించలేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు చేసినప్పటికీ మరే హీరో ఇలాంటి సాహసం చేయడానికి ధైర్యం చేయలేదు. “ఆర్ ఎక్స్ 100” సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ హీరో “హిప్పీ” సినిమాలో నటిస్తున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కార్తికేయ తన సిక్స్ ప్యాక్ బాడీని ఎక్స్ పోజ్ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అతడి ఇంకా “ఆర్ఎక్స్ 100” హ్యాంగ్ ఓవర్ నుండి బయటకొచ్చినట్లు లేడని, అత్యుత్సాహం ఎక్కువైందని కామెంట్స్ చేస్తున్నారు.

Related posts