telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

180 డిగ్రీల కోణంలో కంగన లెగ్ స్ట్రెచ్… పిక్ వైరల్

Kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. గత కొన్నిరోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాగా గతంలో ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫొటోను హీరోయిన్ కంగన రనౌత్ తాజాగా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. అది తాను చేసిన ‘దత్తు’ పాత్రకు సంబంధించిన ఫొటో తెలిపింది. ఆ సినిమాలో తాను నటించిన ‘దత్తు’ ఒక గొప్ప పాత్ర అవుతుందని ఎవరు ఊహించారు? అంటూ ఆమె ప్రశ్నించింది. ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ఫొటో దిగానని చెప్పింది. ఆ సినిమాలో లాంగ్ జంప్ సీన్‌కు ముందు తాను పూర్తిగా కాళ్లను స్ట్రెచ్ చేశానని చెప్పింది. ఆ ఫొటోలో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఉన్నారని తెలిపింది. 180 డిగ్రీల కోణంలో కంగన లెగ్ స్ట్రెచ్‌ చేయడం చూసి నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం కంగనా “తలైవి” చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంది.

Related posts