దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో, ప్రతి ఒక్కరూ తమ సాధారణ జీవితాలకు తిరిగి వస్తున్నాయి అనుకుంటున్నారు. సెకండ్ వేవ్ పుంజుకుంటున్న తరుణంలో.. ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు ప్రాణాంతకమైన కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.
తాజాగా.. స్టార్ హీరో కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడ్డారు. కమల్ హాసన్ ఇటీవల తన సొంత క్లాత్ బ్రాండ్‌ను ప్రారంభించినందుకు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తన రాబోయే చిత్రం ‘విక్రమ్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ఇండియాకు వచ్చారు. కమల్ హాసన్‌కు దగ్గు ఉండడంతో కోవిడ్-19 కోసం పరీక్షలు చేయగా దురదృష్టవశాత్తు పాజిటివ్‌గా అని తేలింది.
ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా తమిళంలో పోస్ట్ చేసాడు.. “అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత.. నాకు కొద్దిగా దగ్గు ఉండంతో పరీక్ష చేయగా COVID-19 పాజిటివ్ అని నిర్ధారించబడింది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాను. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి’ విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అటు ప్రజలు కూడా ఆందోళన గా ఉన్నారు. మూడో సీజన్ కూడా వస్తే.. షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సి వస్తోంది.