నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన “118” సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే రాబట్టుకుంది. ఆ తరువాత కళ్యాణ్ రామ్ గ్యాప్ లేకుండా కొత్త సినిమాలకు వరుసగా ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా, సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో చేస్తోన్న సినిమాకు “ఎంత మంచివాడవురా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కళ్యాణ్ రామ్ ఒక సరికొత్త ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. గోపి సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే “ఎంత మంచివాడవురా” చిత్రం గుజరాతీ హిట్ చిత్రం ఆక్సీజన్‌కి రీమేక్‌గా తెరకెక్కుతుందట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, ఫీల్‌ను మిస్ చేయకుండా చాలా చక్కగా సతీష్ వేగశ్న తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. ఈ సినిమాలో నటాషా దోషి స్పెషల్ సాంగ్‌లో నటించింది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.
previous post
మీరు చూసే చూపులోనే తప్పుంది..దుప్పటి కప్పుకొని కూర్చొన్న అశ్లీలంగానే కనిపిస్తాం