telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాట్ గా “బ్యూటిఫుల్” ట్రైలర్… రంగీలాకు ట్రిబ్యూట్‌

Beautiful

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గతంలో రూపొందించిన సూపర్‌హిట్ సినిమా రంగీలాకు ట్రిబ్యూట్‌గా తెరకెక్కుతున్న చిత్రం “బ్యూటిఫుల్”. “లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌”కు వర్మతోపాటు సహ దర్శకత్వం వహించిన అగస్త్య మంజు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రచన, సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా ఆయనే చేపడుతున్నారు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌ పతాకంపై తెరకెక్కుతోంది. పార్థ్ సూరి, నైనా గంగూలీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. పూర్తి రొమాంటిక్ గా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ సినిమాకు రవి శంకర్ సంగీతం అందించారు. నరేశ్‌ కుమార్‌, శ్రీధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Related posts