telugu navyamedia
సినిమా వార్తలు

క్రేజీ రిమేక్‌లో మ‌హాన‌టి..!

సినీ ఇండ‌స్ట్రీలో న‌ట‌న‌కు ఆస్కార‌మున్న ఒక్క మంచి రోల్ ప‌డిందంటే చాలు స్టార్ హీరోయిన్ గా పునాదులు వేసుకున్నట్టే. ఈ క్రేజీ ఛాన్స్ ను మ‌హాన‌టి సినిమాతో చేజిక్కించుకుంది సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్‌.

Keerthy Suresh is MISSING; actor Nithiin requests his Rang De co star to  join him for film's promotions | PINKVILLA

కీర్తి సురేష్ బాలీవుడ్ హిట్ మూవీ ‘మిమి’ తెలుగు – తమిళ రీమేక్‌లో నటించబోతుందనే వార్త తాజాగా నెట్టింట హల్‌చల్ చేస్తోంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు దీని తెలుగు, తమిళ రీమేక్‌లో కీర్తి సురేష్ నటించటానికి ఒకే చెప్పిందట. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Keerthy Suresh joins Mahesh Babu starrer Sarkaru Vaari Paata, makers  announce on her birthday | Regional-cinema News – India TV

ఇటీవల కాలంలో వరసగా ‘పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన కీర్తిని మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా పలకరించబోతోందట. బాలీవుడ్ లో స్టార్ కావాలని కలలు కంటున్న ఓ యువతి ఆర్థికపరమైన ఇబ్బందులతో ఓ విదేశీ దంపతుల కోసం సరోగేట్ మదర్ కావటానికి ఒప్పుకుంటుంది.

Happy Birthday Keerthy Suresh: Celebs and fans wish the starlight on  turning 27 | Tamil Movie News - Times of India

అయితే పుట్టబోయే బిడ్డ మానసిక వైఫల్యంతో పుడతాడనే రిపోర్ట్ రావటంలో అమెరికన్ జంట వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. దాంతో గర్భం దాల్చిన యువత ఏం చేసింది. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టిన బిడ్డను తీసుకువెళ్లడానికి వచ్చిన అమెకన్ జంట ఏ నిర్ణయం తీసుకుందనే అంశంతో ‘మిమి’ తెరకెక్కింది.

Keerthi Suresh: Keerthi denies asking whopping salary | Tamil Movie News -  Times of India

ప్రస్తుతం కీర్తి నటించిన ‘మరక్కార్’, ‘గుడ్ లక్ సఖి’, ‘అణ్ణాత్త’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తమిళ చిత్రాలు ‘సాని కాయిదం’, ‘వాశి’ అలాగే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కారువారి పాట’, మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తోంది. ఇదే క్రమంలో మరో సినిమా చేసేందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజా సమాచారం.

Related posts