telugu navyamedia
తెలంగాణ వార్తలు

కడెం ప్రాజెక్ట్‌కు తప్పిన పెను ముప్పు- ఊపిరిపీల్చుకున్న ప్ర‌జ‌లు

భారీ వరదనీటితో భయాందోళన సృష్టించిన కడెం ప్రాజెక్ట్‌కు పెను ప్రమాదం నుంచి బయటపడింది.ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది

ఎగువన మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో కడెం ప్రాజెక్ట్ కు రికార్డుస్థాయిలో వరదనీరు చేరడంతో ఎక్కడ ప్రమాదం చోటుచేసుకుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది.

ప్రాజెక్ట్ కు ఇన్ ప్లో ఎక్కువగా వుండి ఔట్ ప్లో తక్కువగా వుండటంతో ఆందోళన ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు, అధికారులు ఆందోళన పడ్డారు. అయితే ఎలాంటి ప్రమాదాలు జరక్కముందే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.5  లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా..  అవుట్ ప్లో 2 .5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 17 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. ఇలా ప్రస్తుతానికి డ్యాం సేఫ్ జోన్ లో ఉందని అధికారులు తెలిపారు.

మంగళవారం రోజున సెకనుకు 2లక్షల క్యూబిక్‌ మీటర్ల ప్రవాహంతో విరామం లేకుండా 24 గంటల ప్రవహిస్తే…. 10 టీఎంసీల నీరు వచ్చిచేరుతోంది. కడెంలో సెకనుకు 2.85లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునే సామర్థ్యం ఉండగా…5లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో వరద ఉవ్వెత్తున ఎగిసిపడింది.

ఎగువన బోథ్‌ ప్రాంతం నుంచి భారీ వరదతో కడెం జలాశయం నీటిమట్టం 700 అడుగులకు చేరుకుంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం రాత్రికి రాత్రే ప్రమాదపు సైరన్‌ మోగించింది. పక్కనే ఉన్న పాతకడెం గ్రామాన్ని ఖాళీ చేయించింది. దిగువన ఉన్న కన్నాపూర్, కొందుకూరు, పాండవాపూర్, అంబరీపేట, బెల్లాల్‌ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది.

అయితే వర్షాలు కొనసాగే అవకాశం వుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రాజెక్ట్ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

 

Related posts