telugu navyamedia
తెలంగాణ వార్తలు

అక్బరుద్దీన్ పై వివాదాస్పద వ్యాఖ్యల కేసు ..తీర్పు రేపటికి వాయిదా

ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. విచార‌ణ‌ను రేప‌టికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. కోర్టుకు ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తో పాటు ఎమ్మెల్యేలు , ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

దాదాపు పదేళ్ల క్రితం నిజామాబాద్, నిర్మల్ ఎంఐఎం సభలో హిందూ దేవతలను కించపరిచేలా అక్బరుద్దీన్ ఒవైసీ  వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు రెండు మతాల మధ్య చిచ్చు రేపాయి.

ఎంతగా అంటే, ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులే సుమోటోగా తీసుకొని వివిధ సెక్షన్లకింద  కేసులు పెట్టారు . ఈ కేసులో అరస్టయిన అక్బర్ 40 రోజులు పాటు జైలు శిక్ష అనుభవించిన త‌రువాత బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు విచారణ కొనసాగుతున్న ఈ కేసుపై ఎట్టకేలకు నాంపల్లి కోర్టు రేపు తుది తీర్పు ఇవ్వనుంది.

 

Related posts