telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ సంద‌డి మొద‌లైంది..టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ల‌ ఆర్ట్..

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ గా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం పులి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.

ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు కలిసి నటిస్తుండటంతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

RRR Release Date Confirmed SS Rajamouli Ajay Devgn Alia Bhatt Movie In  Theater On 7 Jan 2022

తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లపై ఓ ఆర్టిస్టు తమ అభిమానాన్ని చాటుకున్నాడు. వినూత్న రీతిలో ఆయన చూపిన అభిమానం అందరికీ ఆసక్తి కలిగిస్తుంది.

 ఆర్ ఆర్ ఆర్‌ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలను ఆవిష్కరించాడు. దీని కోసం అతడు ఏకంగా 15వేల టీ కప్పులను ఉపయోగించాడు.

దేశంలో ఈ తరహాలో ప్రదర్శన మునుపెన్నడూ చూడలేదంటున్నారు ఇది చూసిన వారు. ఒకే ఫ్రేమ్‌లో ఒక వైపు రామ్ చరణ్ మరోవైపు ఎన్టీఆర్ కనిపించేలా చిత్రీకరించి డైహార్డ్ ఫ్యాన్స్ అనిపించుకుంటున్నారు.ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Related posts