telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్లాప్ దర్శకుడికి మహేష్ బాబు భార్య రికమండేషన్ ?

Sarileru-nikevvaru

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’‌. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. జనవరి 12న సినిమా రిలీజ్‌ అంటూ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా గుంటూరు హక్కులను ఫ్లాప్‌ చిత్రాల దర్శకుడు మెహర్‌ రమేష్‌ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా కాలంగా మహేష్ బాబుతో సన్నిహితంగా ఉండే మెహర్‌ రమేష్‌కు నమ్రత రికమండేషన్‌ కారణంగానే ఈ హక్కులు దక్కినట్టుగా ప్రచారం జరుగుతోంది. కన్నడలో మంచి విజయాలు సాధించిన మెహర్‌ రమేష్, తెలుగులో మాత్రం సత్తా చాటలేకపోయాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ దారుణమైన డిజాస్టర్లు కావటంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అడపాదడపా యాడ్‌ షూట్స్‌ చేస్తున్న మెహర్‌ రమేష్, మహేష్ ఫ్యామిలీ పార్టీస్‌, టూర్స్‌లో తరుచూ కనిపిస్తుంటాడు. గతంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బాబీ సినిమాలో ఫ్రెండ్‌ పాత్రలోనూటి నటించాడు మెహర్‌ రమేష్.

Meher-Ramesh

Related posts