వివిధ విశ్వవిద్యాలయాల్లో జర్నలిజం కోర్సులో అడ్మిషన్ తీసుకునే వర్కింగ్ జర్నలిస్టులకు ఫీజు రాయితీ కల్పించనున్నట్టు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు.
తొలుత విక్రమ సింహపురి వర్సిటీతో ప్రెస్ అకాడమీ బుధవారం ఒప్పందం చేసుకుందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల అడ్మిషన్లు, ఫీజు రాయితీలపై సంతకాలు చేసేందుకు సమన్వయ అధికారిగా విక్రమ సింహపురి వర్సిటీ రిజిస్ర్టార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డిని నియమించినట్టు పేర్కొన్నారు.