telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అమరావతిని శ్మశానం అని..జ‌గ‌న్ ఇప్పుడు భూములెలా అమ్ముతారు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్‌ పై విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్‌కు రాజధాని భూములు అమ్మే హక్కు ఎక్కడిది? అమరావతిని శ్మశానంతో పోల్చిన ఈ ప్రభుత్వం… ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు అమ్ముతుందని చంద్రబాబు ప్రశ్నించారు.

సోమవారం నాడు స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను ..ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వజూపడం అన్యాయమ‌ని అన్నారు.

డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీకి ఓట్లు పెరగలేదని చంద్ర‌బాబు అన్నారు. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆత్మకూరు ఉపపోరు ఫలితాల్లో కనిపించింది.

ప్రజలకు అందే సంక్షేమ పథకాల వర్తింపులో రకరకాల నిబంధనల పేరుతో కోతలు పెట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని చంద్ర‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి పథకంలో 52 వేలమంది లబ్దిదారులు తగ్గారు. ఒంటరి మహిళలకు పింఛన్లో ఆంక్షలు అమానవీయమని చంద్రబాబు చెప్పారు.

నిధుల్లేక దుల్హన్ పథకం నిలిపివేశామంటూ కోర్టుకు చెప్పడం దారుణమన్నారు. ఈ-క్రాప్​లో వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి.. పంట నష్టపోయిన రైతులకు మొండిచేయి చూపారని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts