telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా విడుదల : తొలిసారిగా మట్టితో

అత్యంత‌ ప్రఖ్యాతి గాంచిన హైద‌రాబాద్‌ ఖైరతాబాద్ వినాయకుడిని విగ్రహ నమూనా విడుదల అయింది. తొలిసారి ఇక్కడ మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది.

ఈ ఏడాది పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. 50 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఇందులో విగ్రహానికి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు త్రిశక్తి మహా సరస్వతి దేవి విగ్రహాలు ఉన్నాయి ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడికి మరో ప్రత్యేకత కూడా తోడవ్వనుంది. తొలిసారిగా ఇక్కడ ఈ భారీ విగ్రహాన్ని మట్టితో నిర్మిస్తున్నారు. నిమజ్జనానికి తరలి వెళ్లేలా ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ నెల 10న కర్రపూజతో విగ్రహ తయారీ పనులు ప్రారంభం అయ్యాయి.

గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related posts