telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 23, ఆదివారం రాశిఫ‌లాలు..

మేషరాశి..

ముఖ్య‌మైన‌ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. బందువుల‌తో వివాదాలు ఎక్కువ‌వుతాయి.

వృషభరాశి..

అనుకోని ఇబ్బందులు ఎదుర‌వుతాయి. పరిస్థితులు అనుకూలించవు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. మహిళలకు శ్రమ పెరుగుతుంది. ఇంటాబయటా ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు చిక్కులు అధిక‌మ‌వుతాయి.

మిథునరాశి..

ఉద్యోగ‌స్తుల‌కు కార్యాల‌యాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చిరు వ్యాపార‌స్తుల‌కు లాభ‌దాయ‌కంగా ఉంటుంది.

కర్కాటకరాశి..

విద్యార్థులకు అనుకోని చికాకులు ఎదురవుతాయి. కొత్త మిత్రుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వాహనయోగం క‌లుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన‌ నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహరాశి..

దూరపు మిత్రులు లేదా బందువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు ఎదుర‌వుతాయి.

కన్యరాశి..

పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. ప్రయాణం చికాకులు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలలో సమర్థత చాటుకుంటారు.

తులరాశి..

మహిళలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ‌వుతుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. శ్రమకు త‌గిన ఫ‌లితం ఉండ‌దు. ముఖ్య‌మైన‌ పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికరాశి..

విద్యార్థులు విజయాలను సాధిస్తారు. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ధనలాభం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభ‌సాటిగా ముందుకు వెళ‌తాయి.దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

ధనుస్సురాశి..

చేసే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆర్ధిక సమస్యలు తీరతాయి. మీ మంచితనాన్ని అందరూ గుర్తిస్తారు. వ్యాపారాల్లో కుటుంబ స‌భ్యుల‌ ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు రాత ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధిస్తారు.

మకరరాశి..

ప్రారంభించిన పనిలో ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. భూవివాదాలు స‌ద్దుమ‌ణుగుతాయి. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగస్తుల‌కు ప‌ని భారం అధిక‌మవుతుంది. ప్రేమికులుకు మంచి స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

కుంభరాశి..

మీరు అనుకున్నది సాధిస్తారు. ఇంటాబయటా సమస్యలు ఎదుర‌వుతాయి. బంధువులతో విరోధాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యంతో బాధ‌ప‌డ‌తారు. ప్రయాణాలలో మార్పులు చేర్పులు ఉంటాయి. ముఖ్య‌మైన ప‌నులు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి.

మీనరాశి..

కుటుంబంలో సంతోషంగా ఉంటారు. నూతన కార్యాల‌కు శ్రీకారం చూడ‌తారు. ద‌గ్గ‌ర బందువుల‌ నుంచి శుభవార్తలు వింటారు. వ‌స్తు, వాహనయోగం క‌లుగుతుంది. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు మంద‌గిస్తాయి. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Related posts