telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీజర్ రిలీజ్‌

యంగ్‌ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రానికి భిన్న కథలతో అలరించే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథగా తెరకెక్కిందని తెలుస్తుంది. టీజ‌ర్‌ చూస్తే సుధీర్ బాబు దర్శకుడి పాత్ర చేశారు. డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతి శెట్టి కనిపించారు.

Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser: Sudheer Babu and Krithi Shetty  promise a fun romantic comedy | PINKVILLA

‘రోల్ సౌండ్… రోల్ కెమెరా… యాక్షన్’ అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్‌తో సినిమా టీజ‌ర్‌ ప్రారంభం అయ్యింది… ఆరు సంవత్సరాల్లో వరుసగా 6 సూపర్‌ హిట్‌లు అందించిన కమర్షియల్‌ ఫిల్మ్‌ మేకర్‌గా సుధీర్‌ బాబుని పరిచయం చేయడంతో టీజర్‌ ప్రారంభమవుతుంది. 6 సూపర్‌ హిట్‌లు అందించిన డైరెక్టర్‌గా కొంచెం గర్వంతో ఉన్న సుధీర్ బాబుకి అవన్ని రోటీన్ సినిమాలను అతని స్నేహితుడు ఎగతాళి చేయడం బాగుంది.

Aa Ammayi Gurinchi Meeku Cheppali | ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..  అంటున్న‌ సుధీర్ బాబు.. బేబ‌మ్మ‌తో రొమాన్స్‌

అ‍ప్పుడే డాక్టర్‌ అలేఖ్య పాత్రలో నటిస్తున్న కృతి శెట్టిని హీరో వాసు కలుస్తాడు. ఆమె ఒక కళ్ల డాక్టర్‌. ఆమెకు సినిమాలంటే అస‌లు ఇష్ట‌ముండ‌దు.అ లాంటి అమ్మాయిని నటిగా వాసు మారుస్తాడు. .తను అమ్ముకునే సినిమాలు కాకుండా తనను నమ్ముకునే సినిమాలు చేస్తానని హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sudheer Babu Starts Shooting For Aa Ammayi Gurinchi Meeku Cheppali

బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related posts