భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 3,33,533 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.. తాజాగా కరోనా మహమ్మారి వల్ల 525 మంది మరణించారు..
దేశంలో గడిచిన 24 గంటల్లో 2,59,168 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 21,87,205 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.78 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.18 శాతం నమోదైనట్లు పేర్కొంది.
శనివారంతో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి ..శనివారం 3.37 లక్షల కేసుల నమోదయ్యాయి. కోలుకున్నవారు 21,324 మంది..
తాజగా కేసులతో చూస్తే దేశంలో నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,92,37,264 కి చేరింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 4,89,409 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో 3,65,60,650 మంది కోలుకున్నారనని కేంద్రం తెలిపింది.
కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 71,10,445 డోసులు అందించారు .
దేశంలో ఇప్పటి వరకు 161.92 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 71.55 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.