telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 5, బుధవారం రాశిఫ‌లాలు

మేష రాశి..

మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఎవరి తోను గొడవలకు దిగకపోవడం మంచిది. కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.

వృషభ రాశి..

బంధువులతో గొడ‌వ‌లు ఏర్ప‌డ‌తాయి. కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల నుంచి సహాయం అందుకుంటారు. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచి జ‌రుగుతుంది.

మిథున రాశి..

వ్యాపారాలు ముందుకు సాగుతాయి.. దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి..ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్రీలుకు పొత్తికడుపుకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురుకావచ్చు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీడియా, సినిమా పరిశ్రమలో పనిచేసే వారికి బాగుంటుంది.

కర్కాటక రాశి..

బ‌య‌ట వారితో జాగ్రత్తగా ఉండ‌డం మంచిదికాదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. ముఖ్య‌మైన వ్య‌వహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుంది.. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. విందువినోదాల్లో పాల్గొంటారు.

సింహ రాశి..

అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. శతృవులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి ఎక్కువ‌వుతుంది. ధైర్యంతో ముందుకెళ్లడమే మంచిది. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

కన్య రాశి..

విద్యార్ధుల‌కు తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వహించాలి. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంట్లో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. స‌మాజంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి సంద‌డి సంద‌డిగా ఉంటుంది.

తులరాశి..

ఆరోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. మీరు చేసే ప‌నిలో ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సన్నిహితులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం క‌నిపిస్తుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు మంద‌కొడిగా ఉంటాయి.

వృశ్చిక రాశి..

అనుకున్న పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ‌స్తులు ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు.

ధనుస్సు రాశి..

పట్టుదలతో ముందుకెళితే విజ‌యాలు మీ సొంతం అవుతాయి. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు ల‌భిస్తుంది. చేపట్టిన బాధ్యతలను సరిగ్గా నెరవేర్చుతారు. సమయానుకూలంగా ముందుకు వెళ్లాలి. పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు. దైవదర్శనాలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకర రాశి..

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తల పెట్టిన పనులలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. విదేశీ ప్ర‌యత్నాలలో విజయం సాధిస్తారు.కుటుంబసమస్యలు ఎక్కువవుతాయి.

కుంభ రాశి..

ఉద్యోగాలలో అన‌కోని చికాకులు ఏర్ప‌డ‌తాయి ధైర్యంతో ముందుకెళ్లడం వల్ల చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రుల నుంచి ఆస్తి కోసం ఒత్తిడులు ఎక్కువ‌వుతాయి. కష్టపడి పని ఆశించిన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

మీన రాశి..

బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న‌నాటి స్నేహితుల‌తో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు నుంచి ఒత్తిడి ఎక్కువ‌వుతుంది.

Related posts