జన అధినేత పవన్ కల్యాణ్ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల స్వేదం చిందించకపోతే ఏ దేశమైనా ఏ జాతి అయినా అభివృద్ధి పధాన పయనించలేదన్నారు పవన్ కల్యాణ్. ఎక్కడ శ్రమైక సౌందర్యం వెల్లివిరుస్తుందో ఎక్కడ కార్మికులు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తారో అక్కడ సమాజం సిరిసంపదలతో అలరారుతుందన్నారు.
కుల జాతి వర్గ భేదాలకు అతీతంగా కార్మికులందరూ ఐక్యంగా జరుపుకొనే వేడుక మేడే..దేశాన్ని కాపాడే సైనికులు, అందరికీ అన్నంపెట్టే రైతులతో పాటు ఆ స్థాయిలో గౌరవించవలసిన వారు మన కార్మికులు.
దేశ సౌభాగ్య కోసం ఎండనకా, వాననకా, కాలలకు అతీతంగా నిద్రహాలు మాని దేశం కోసం అహరాహం కష్టించి, శ్రమించే కార్మికులందరికీ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు . కార్మిక లోకమంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
సంపద సృష్టికర్తలు మన కార్మికులు – JanaSena Chief Shri @PawanKalyan #MayDay pic.twitter.com/6QbJg5H3NM
— JanaSena Party (@JanaSenaParty) May 1, 2022
చంద్రబాబుకు ఫేస్ వాల్యూ లేదు: లక్ష్మీపార్వతి